దక్షిణ భారత యాత్ర చేయదలుచుకొన్నవారు ముందుగా తెలిసికొనవలసిన ప్రధానమైన అంశం ఒకటి వుంది. తమిళనాడు రాష్ట్రంలో బాగా ప్రసిద్ది చెందిన దేవాలయాలలో Kumaraswamy దేవాలయాలు-తిరుచందూరు, పళని, తిరుత్తణిలోని ఆలయాలు చాల ప్రముఖమైనవి. ఇవి సుబ్రహ్మేణ్యేశ్వరుడు అని పిలువబడే Kumaraswamy దేవాలయాలు. ఈ ఆలయాలు తమిళనాడులోనే గాక, భారతదేశంలోనే అతి ధనవంతమైన దేవాలయాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఈ ఆలయాలకు భక్తులు లక్షల సంఖ్యలో వస్తూ వుంటారు.
అయితే, సుబ్రహ్మణ్యం అని పిలవబడే ఈ Kumaraswamy, ఏ కారణం చేతనో కేవలం తమిళనాడు రాష్ట్రానికే పరిమితం. ఒక విధంగా సుబ్రహ్మణ్యం తమిళుల రాష్ట్రదైవం అని చెప్పవచ్చు.

కాని తమిళనాడు తప్ప మిగిలిన రాష్ట్రాలలో Kumaraswamy అంతగా ప్రాముఖ్యం లేదు. ఆంధ్రదేశంలో ఎందుకనో సుబ్రహ్మణ్యేశ్వరుడు అనే పేరు వున్న దేవాలయాలలో ఈశ్వరుని లింగరూపమైన మూర్తి వుంటుంది. ఉత్తర భారతదేశం వారికి కుమారస్వామిని గూర్చి దాదాపు తెలియదు అనే చెప్పాలి. అసలు కుమారస్వామి జన్మ వృత్తాంతాన్ని గూర్చి తెలియజెప్పే ఖచ్చితమైన వివరాలు ఏ పురాణకథలోను నిర్దుష్టంగా లేవు.
రామాయణంలోని బాలకాండలో Kumaraswamy జననం గూరించి ఈ విధంగా చెప్పబడ్డది. పరమేశ్వరుని యొక్క శక్తి తగ్గి పోకుండా వుండేటందుకు ఆయనను బ్రహ్మచర్యం పాటించమని దేవతలందరూ ప్రార్ధించారుట. ఆయన వారి అభ్యర్థనను మన్నించాడు. కాని, తనకు అప్పుడే స్కలనం జరిగి పోయినట్లు చెప్పాడు. అప్పుడు ఆ దేవతలందరూ కలసి ఆ స్కలనాన్ని అగ్ని దేవుడు, భూమి భరించాలని నిర్ణయించారు. మొదట అగ్ని దానిని స్వీకరించి, భూమికి యిచ్చాడు.
భూమి ఆ స్కలనాన్ని గ్రహించగానే, అది ఒక తెల్లని కొండగా మారింది. భూదేవి ఆ కొండను తను భరించింది. అప్పుడు ఆ కొండలోనుంచి Kumaraswamy జన్మించాడు.
ఓ మహాభారతంలో మరొక కథ చెప్పబడినది. ప్రజాపతి బ్రహ్మకు, దేవసేన, దైత్యసేన అని ఇద్దరు కుమార్తెలు. దైత్యసేనకు తన సోదరి దేవసేన అంటే పడదు. అందువల్ల దైత్యసేన ప్రోద్భలంతో కేశి అనే రాక్షసుడు దేవసేనను ఎత్తుకు పోతాడు. ఇంద్రుని ప్రార్ధన మీద, దేవసేనకు అమిత పరాక్రమంతుడు అయినవాడు భర్తగా లభిస్తాడని వరమిస్తాడు.
ఒకప్పుడు సప్తర్షులు ఒక గొప్ప యజ్ఞం చేస్తూ వుంటారు. యజ్ఞ భాగాన్ని స్వీకరించటానికి అగ్ని దేవుడిని ఆహ్వానిస్తారు. కాని అగ్ని దేవుడు అక్కడ సప్తర్షుల భార్యలను చూసి మోహిస్తాడు. దక్షుని కుమార్తె స్వాహాదేవి. ఆమెకు అగ్ని దేవుని మీద మనసు పడింది. అగ్ని దేవుడు సప్తర్షుల భార్యలను మోహించాడు అని తెలిసి, స్వాహాదేవి తనే, మహా పతివ్రత అయిన అరుంధతి తప్ప, మిగిలిన ఆరుగురు ఋషుల భార్యల రూపం ధరించి అగ్ని దేవునితో సుఖించింది.
అలా ఆమె ఒక్కొక్క ఋషిపత్ని రూపంలో ప్రతిసారి సుఖించి, అగ్ని దేవుని నుంచి స్వీకరించిన స్కలనాన్ని ఒక తెల్లని కొండపై జారవిడిచింది. ఆ ఆరుకణాలు కలిసి పన్నెండు చేతులు గల ఒక బాలుని రూపంగా అవతరించింది. అతనిని రుద్రుడు కుమారునిగా స్వీకరించాడు. ఆ తరువాత అతను దేవసేనను పెళ్లి చేసికొంటాడు. అయితే, వేద సాహిత్యంలో రుద్రుడు అన్నా అగ్ని అన్నా ఒక్కటే.
మరొక కథ ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడు తన తమ్ముడు శూరపద్ముడు అనేవానితో కలసి దేవతలను బాధిస్తూ వుంటాడు. అప్పుడు దేవతలందరూ కలసి పరమేశ్వరుడయిన శివుడిని ప్రార్ధిస్తారు. శివుడు వారి కోరికను మన్నించి తన వీర్య కణాన్ని అగ్నిలో వదుల్తాడు. కాని అగ్ని దానిని తను భరించలేక గంగలో వదుల్తాడు.
గంగ కూడా ఆ వీర్యకణాన్ని భరించలేక, అదే సమయానికి గంగలో స్నానం చేస్తూ వున్న కృత్తికలు అనే ఆరుగురు కన్యలకు సమానంగా పంచి యిస్తుంది. ఆ ఆరుగురు కన్యలు ఆరుగురు పుత్రులను కంటారు. ఆ ఆరుమంది పిల్లల రూపాలను ఒకటిగా కలిపి, ఆరుతలలు, పన్నెండు చేతులు గల ఒక బాలునిగా రూపొందించి పెంచుతారు.
తమిళులు సంప్రదాయంగా చెప్పుకుంటూ వస్తున్న కధ ప్రకారం, అలా ఆ ఆరుగురు కృత్తికలచేత పెంచబడ్డ ఆ కుమారుని దేవతలు తమ సేనాధిపతిగా ఎన్నుకుంటారు. అప్పుడు ఆ బాలుడు గొప్ప తపస్సు చేస్తాడు. పార్వతిదేవి ప్రత్యక్షమై ఆ బాలుని తన కుమారునిగా స్వీకరిస్తుంది. తన శక్తినంతా నింపిన ఒక శూలాన్ని పార్వతి ఆ బాలునికి ప్రసాదిస్తుంది. తరువాత దేవతలందరూ కూడా తమ తమ అంశకు సంబంధించిన శక్తిని ఆ శూలంలో నింపుతారు. ఆ శూలాన్ని ధరించి, Kumaraswamy వెళ్లి తారకాసురునితో యుద్ధం చేస్తాడు.
తారకాసురునితో జరిగిన యుద్ధం ఆరు రోజులు పట్టింది. ఆరవ రోజున ఆ రాక్షసుడు సంహరింపబడ్డాడు. ఈ తారకాసుర సంహారం తిరుచందూరులో జరిగిందని తమిళుల విశ్వాసం. అప్పుడు దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను Kumaraswamyకి యిచ్చి వివాహం జరిపాడు. ఈ వివాహం మదురైలోని తిరుప్పరకుండ్రంలో జరిగింది.
తారకాసురుడు సంహరింపబడిన తరువాత అతని తమ్ముడు శూరపద్ముడు పారిపోయి ఒక మామిడి చెట్టు రూపం ధరించి ఒక అడవిలో దాగి వున్నాడట. Kumaraswamy తన శూలంతో ఆ మామిడి చెట్టును పొడవగా అది రెండుగా చీలి పోయింది. ఆ రెండు చీలికలలో ఒకటి ఒక నెమలిగాను, రెండవది ఒక కోడిగాను మారి పోయాయి. Kumaraswamy ఆ రెండింటిని తన వాహనాలుగా స్వీకరించాడు. తండ్రిత బ్రహ్మ దేవుడు ఒకసారి ప్రణవ మంత్రానికి (ఓం అనే శబ్దానికి అర్ధం చెప్పలేకపోతే కుమారస్వామి ఆయనను బంధించాడు. తరువాత తన తండ్రి శివుని ఆజ్ఞ ప్రకారం బ్రహ్మను విడుదలచేసి తనే స్వయంగా ఆయనకు ప్రణవ మంత్రానికి అర్ధం ఉపదేశం చేశాడు..
అందువలన స్కలనంలో నుంచి ఉద్భవించిన వాడు కనుక ‘స్కందుడు’ అని, ఆరు రహస్యరూపాలు కలసి పుట్టినవాడు గనుక ‘గుహుడు’ అని, కృత్తికల చేత పెంచబడిన వాడు గనుక ‘కార్తికేయుడు’ అని, ప్రణవ మంత్రాన్ని బోధించిన వాడు గనుక ‘గురుడు’ అని, ఆరు ముఖాలు కలిగిన వాడు గనుక ‘షణ్ముఖుడు’ అని, అగ్నిలో నుంచి పుట్టినవాడు గనుక ‘అగ్నిభుడు’ అని, గొప్ప జ్ఞాని గనుక ‘యోగీశ్వరుడు’ అని, శూలం (తమిళంలొ వేల్) ఆయుధంగా ధరించినవాడు గనుక ‘వేలాయుధన్’ అని అనేక పేర్లు వున్నాయి.
తమిళుల విశ్వాసం ప్రకారం Kumaraswamy ఆరు రూపాలుగా ఆరు ప్రదేశాలలో వెలసి వున్నాడు. చిన్న బాలుని రూపంలో ‘పళని’లోను, తారకాసురుడిని సంహరించినవాడుగా ‘తిరుచందూరు’ లోను, దేవసేనను వివాహం చేసికొన్న వాడిగా ‘తిరుప్పుర కుండ్రం’లోను, శ్రీవల్లి అనే ఆమెను గూడ వివాహం చేసికొని, కాపురం చేస్తూవున్న వాడిగా ‘తిరుత్తణి’లోను, ముని రూపంలో వున్నవాడిగా ‘స్వామిమలై’ లోను, అన్నీ పరిత్యాగం చేసి తపస్సు చేసి కొంటున్న ముని రూపంలో ‘పళముదిర్ శూలై’ లోను వెలసి వున్నాడు. ఆయా ఊళ్ళకు వెళ్లినప్పుడు ఆయా అవతారాలకు సంబంధించిన వివరాలు తెలిసికొందాం.
కాగా, తమిళనాడులోని ప్రతి శివాలయంలోను Kumaraswamyకి గూడా ఒక ప్రత్యేక ఆలయం వుంటుంది. తమిళనాడువారు కార్తీక శుద్ధ షష్టి రోజును ‘స్కంధ షష్టి’ అంటారు. కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి షష్టి వరకూ తమిళనాడు అంతటా గొప్ప ఉత్సవాలు జరుగుతాయి. ఆరవ రోజున అంటే ‘స్కంధ షష్టి’ రోజున తారకాసుర సంహారం గుర్తుగా గొప్ప ఉత్సవం జరుగుతుంది. కుమారస్వామి ఆయుధం శూలం. ఆయన అర్ధం చెప్పిన ప్రణవ మంత్రానికి మూలాక్షరం ‘ఓం’. అందువలన Kumaraswamy గుర్తుగా ‘ఓం’ అనే అక్షరమూ, శూలము కూడా పూజింపబడుతాయి.